ప్రేమా పూర్ణుడు ప్రాణా నాథుడు - prema purnudu prana nadhudu song lyrics

ప్రేమా పూర్ణుడు ప్రాణా నాథుడు 
నను ప్రేమించి ప్రాణమిచ్చెను      (2)
నే పాడేదన్ కొనియాడేదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తును ప్రకటింతును (4)          " ప్రేమా "

లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ 
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల ఎంతో 
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్ట లేనిది కలువరిలో ప్రేమ 
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ (2)           " ప్రేమా " 

మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ 
మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ (2) 
రక్తము కార్చి రక్షననిచ్చి
ప్రాణము పెట్టి పరమున చేర్చే (2)
గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ 
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ (2)            " ప్రేమా " 


Comments

Popular Posts