పదములు చాలని ప్రేమ ఇది - padhamulu chalani prema idhi song lyrics

పదములు చాలని ప్రేమ ఇది 
స్వరములు చాలని వర్ణనిది  (2) 
కరములు చాపి నిను కౌగిలించి పెంచిన 
కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ 
వారిని సహితము కన్న ప్రేమ 

ప్రేమ ఇది యేసు ప్రేమ
ప్రేమ ఇది తండ్రి ప్రేమ 
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ 
కలువరి ప్రేమ (2) 

నవమాసం మోసి ప్రయోజకులను చేసిన 
కన్నబిడ్డలే నిన్ను వెలివేసిన (2)
తన కరములు చాపి నిను ముదిమి వచ్చు వరకు 
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ 
ఆవేదనంత తొలగించు ప్రేమ                            " ప్రేమ " 

మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన 
స్నేహితులే హృదయములను గాయ పరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి 
క్షమియించుట నేర్పించెడి ప్రేమ 
శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ                     " ప్రేమ " 


Comments

Popular Posts