yesayya naa pranama song lyrics | Hosanna ministries new song 2025

యేసయ్య నా ప్రాణమా 
ఘనమైన స్తుతియాగమా 
అద్భుతమైన నీ ఆదరణే 
ఆశ్రయమైన నీ సంరక్షణయే 
నను వీడగ వెంటాడెను 
నే అలయక నడిపించెను 
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన 
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా 

చరణం 1: 
చిరకాలము నాతో ఉంటానని 
క్షణమైనా విడిపోలేదని 
నీలో నను చేర్చుకున్నావని 
తండ్రితో ఏకమై ఉన్నామని 
ఆనంద గానము నే పాడనా      (2) 
ఏదైనా నాకున్న సంతోషము 
నీతోనే కలిగున్న అనుబంధమే  (2)
సృజనాత్మకమైన నీ కృప చాలు 
నే బ్రతికున్నది నీ కోసమే          (2)                 " యేసయ్య " 

చరణం 2: 
జీవజలముగా నిలిచావని 
జలనిధిగా నాతో ఉన్నావని 
జనులకు దీవెనగా మర్చావని 
జగతిలో సాక్షిగా ఉంచావని 
ఉత్సాహ గానము నే పాడనా   (2)
ఏదైనా నీ కొరకు చేసేందుకు 
ఇచ్చితివి బలమైన నీ శక్తిని 
ఇదియే చాలును నా జీవితాంతము 
ఇల నాకన్నియు నీవే కదా        (2)               " యేసయ్య "

చరణం 3:
మధురము కాదా నీ నామధ్యానం 
మరపురానిది నీ ప్రేమ మధురం 
మేలు చేయుచు ననునడుపు వైనం 
క్షేమముగా ఈ లోక పయనం 
స్తోత్ర గీతముగా నే పాడనా              (2)
నిజమైన అనురాగం చూపావయ్యా 
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా     (2) 
స్తుతుల సింహాసనం నీ కొరకే గా 
ఆసీనుడై నను పాలించావా             (2)       " యేసయ్య " 


స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన 
ఆనందమే - పరమానందమే - నీలో నా యేసయ్యా 

Comments

Popular Posts