oohakandhani premalona song lyrics | Hosanna ministries songs lyrics 2025
ఊహకందని ప్రేమ లోన భావమే నీవు
హృదయమందు పరవశించు గానమే నీవు
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు
మరపురాని కలల సౌధం గురుతులే నీవు
ఎడబాయలేనన్న నిజ స్నేహమే నీవు
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు (2)
తల్లడిల్లె తల్లికన్నా మించి ప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది
అదియే నే గాయ పరచిన వేళలో
కన్నీరు కార్చిన ప్రేమ గా
నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే (2)
" ఊహ "
నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేలకొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా (2)
అదియే .. ఓ ..
తన మహిమ విడచిన త్యాగము
ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెతకిన నీ మధుమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన ధాతవు నను హత్తుకున్న స్వామివి (2)
" ఊహ "
దేహమందు గాయమైతే కుదుటపడును కదా
గుండె గాయము గురుతుపట్టిన నరుడు లేదు కదా (2)
నీవే .. నీవే .. యేసయ్యా
నా అంతరంగం తరచి చూసినా గాఢమైన ప్రేమవు
నను భుజము పైన మోసిన అలసి పోనీ ప్రేమావు
నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయా (2)
" ఊహ "
Comments