raja jagamerigina song lyrics | Hosanna minsitries 2025 song lyrics

రాజా జగమెరిగిన నా యేసయ్యా 
రాగాలలో అనురాగాలు కురిపించిన 
మన బంధము -  అనుబంధము 
విడదేయగలరా ఎవరైనను - మరి ఏదైననూ (2)

దీన స్థితి యందునా - సంపన్న స్థితి యందునా 
నడచినను ఎగిరినను - సంతృప్తి కలిగి యుందూనే 
నిత్యము ఆరాధనకు -  నా అధారమా 
స్త్రోత్ర బలులు నీకే - అర్పించెద యేసయ్యా (2)         " రాజా " 

బలహీనతలయందున - అవమానములయందున 
పడినను - కృంగినను - నీ కృప కలిగియుందునే 
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా 
స్తోత్ర బలులు నీకే - ఆర్పించెద యేసయ్యా (2)        " రాజా " 

సీయోను షాలేము - మన నిత్య నివాసము 
చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగియుందునే 
నిత్యము ఆరాధనకు  - నా  ఆధారమా 
స్తోత్ర బలులు నీకే - అర్పించెద యేసయ్యా (2)       " రాజా " 

Comments

Popular Posts