kurisindi tholakari vaana song lyrics | hosanna minsitries 2025 new song lyrics
కురిసింది తొలకరి వాన నా గుండెలోన (2)
చిరు జల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై
నీ నిత్య కృపయే వాత్సల్యమై
నీ దయయే హెర్మోను మంచు వలే (2)
పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన
ఆనందించి అరాధించేద నా యేసయ్యా (2)
ధూళినై పాడైన ఎడారిగా నను చేయక
జీవ జల ఊటలు ప్రవహింపజేశావు (2)
కలతల కన్నీళ్లలో కనుమరుగై పోనీయక
సాక్షి మేఘమై నిరీక్షణగా నిలచావు
స్తుతులు స్తోత్రము నీకెనయ్య దయా సాగరా (2) " పొంగి "
నీ మందిర గుమ్మము లోని బూటలతో శుద్ధి చేసి
నా చీలమండలమునకు సౌందర్యమిచ్చితివి (2)
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నను నడిపితివి (2)
తడిసి మునిగి తేలేదనయ్యా ప్రేమ సాగరా
తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా " పొంగి "
నా తొలకరి వర్షము నీవై చిగురింప జేశావు
నా ఆశల ఊహలతో విహరింపజేసావు (2)
నా కడవరి వర్షము నీవై ఫలింపజేసావు
నీ మహిమ మేఘము లో నను కొని పోయేదవు (2)
హర్ష ధ్వనులతో హర్షించెదను కరుణా సాగర
హర్ష ధ్వనులతో హర్శించెదను కరుణా సాగర " పొంగి "
Comments