క్రీస్తే సర్వాధికారి - kreesthe sarvadhi kaari song lyrics

క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి 
క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి                 " క్రీస్తే "

ముక్త విధాత నేత - శక్తి నొసంగు దాత 
భక్తి విలాప శ్రోత - పరమంబు వీడే గాన            " క్రీస్తే "

దివ్య పథంబు రోసి - దైవంబు తోడు బాసి 
దాసుని రూపు దాల్చి - ధరణి కేతెంచె గాన        " క్రీస్తే " 

శాశ్వత లోక వాసి - సత్యామృతంపు రాశి 
శాప భారంబు మోసి - శ్రమల సహించే గాన      " క్రీస్తే " 

సైతాను జనము గూల్పన్ 
పాతాళమునకు బంపన్ 
నీతి పథంబు బెంప 
రుధిరంబు గార్చె గాన                                    " క్రీస్తే "

మృత్యువు ముల్లును తృంపన్ 
నిత్య జీవంబు బెంపన్ 
మార్థ్యాలి భయము దీర్పన్ 
మరణంబు గెలిచే గాన                                 " క్రీస్తే " 

పరమందు దివిజులైన
ధరయందు మనజులైన 
ప్రతి నాలుక మోకాలు
ప్రభువే భజించు గాన                                   " క్రీస్తే " 

ఈ నామమునకు మించు 
నామంబు లేదటంచు 
యెహోవా తండ్రి యేసున్ 
హెచ్చించి నాడు గాన                                  " క్రీస్తే " 

Comments

Popular Posts