కలువరి గిరిలో - kaluvari girilo song lyrics

కలువరిగిరిలో సిలువ ధారివై 
వ్రేలాడితివా నా యేసయ్యా    (2) 

అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను 
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా            (2)
నా ద్వేష క్రియలకు సిలువలో బలియైతివా 
నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా           (2)   " కలువరి " 

దారి తప్పి పోయిన గొర్రెనై తిరిగాను 
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను          (2)
ఆఖరి రక్తపు బొట్టును మా కొరకై ధార పోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా           (2)  " కలువరి " 

Comments

Popular Posts