jaya sankethama song lyrics | Hosanna ministries 2025 new song lyrics

జయ సంకేతమా దయా క్షేత్రమా 
నను పాలించు నా యేసయ్యా (2) 
అపురూపము నీ ప్రతి తలపు 
అలరించిన ఆత్మీయ గెలుపు (2) 
నడిపించే నీ ప్రేమ పిలుపు 

నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు సర్వము సమకూర్చేనే (2)
నన్నేల ప్రేమించ మనసాయెను 
నీ మనసేంతో మహోన్నతము 
కొంతైనా నీ రుణము తీర్చేదెలా 
నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా 
విరిగి నలిగిన మనసుతో నిన్నే 
సేవించేదా నా యజమానుడా (2)            " జయ సంకేతమా "

నిలిచెను నా మదిలో నీ వాక్యమే 
నాలోన రూపించే నీ రూపమే (2) 
దీపము నాలో వెలిగించగా 
నా ఆత్మ దీపము వెలిగించగా 
రగిలించే నాలో స్తుతి జ్వాలలు 
భజయించి నిన్నే కీర్తింతును 
జీవిత గమనం స్థాపించితివి 
సీయోను లో చేర నడిపించుమా (2)        " జయ సంకేతమా " 

నీ కృప నా యెడల విస్తారమే 
ఏనాడు తలపని బాగ్యమిది (2)
నీ కృప నాకు తోడుండగా 
నీ సన్నిధియే నాకు నీడాయెను 
ఘనమైన కార్యములు నీవు చేయగా 
కొదువేమీ లేదాయే నాకెన్నడు 
ఆత్మ బలములతో నను నడిపించే 
నా గొప్ప దేవుడవు నీవేనయ్యా (2)        " జయ సంకేతమా " 

Comments

Popular Posts