ఎవరికోసమో ఈ ప్రాణత్యాగము - evarikosamo ee praana thyagamu song lyrics | good Friday telugu songs lyrics

ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము 
ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము 
నీకోసమే నా కోసమే 
కలువరి పయనం - ఈ కలువరి పయనం (2)     " ఎవరి " 

ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాప లోకమే సిలువ వేసిందా 
ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా  (2)
మ్రాయలేని మృాను తో మోము పైన ఉమ్ములతో 
నడువలేని నడతలతో తడబడుతూ పోయావా 
సోలి వాలి పోయావా                                     " ఎవరి " 

జీవ కిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళ కిరీటం నీకు పెట్టాము 
జీవ జలములు మాకు ఇచ్చావు 
చేదు చిరకను నీకు ఇచ్చాము (2) 
మా ప్రక్కన ఉంది మమ్ము కాపాడుచుండగా 
నీ ప్రక్కలో బల్లెముతో - ఒక్క పోటు పొడిచితిమి 
తండ్రి వీరెమిచేయుచున్నారో వీరు ఎరుగరు 
వీరిని క్షమించు - వీరిని క్షమించు 
అని వేడుకున్నావా పరమ తండ్రిని                 " ఎవరి " 

Comments

Popular Posts