ఎంతో వింత ఎంతో చింత - entho vintha entho chintha song lyrics | good Friday song lyrics
ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత
పంతముతో జేసిరంత సొంత ప్రజలు స్వామి నంత
" ఎంతో "
చరణం 1 :
పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాథు నకటా
అట్టి శ్రమల నొంది పలుకన్ డాయే యేసు స్వామి నాడు
" ఎంతో "
చరణం 2:
మొయ్య లేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని
మోయ్యలేక మృాని తోడ మూర్చన్ బోయే నేసు తండ్రి
" ఎంతో "
చరణం 3:
కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలు సేతులలోన్ జీలల్
కఠినులంత గూడి కొట్టిరి ఘోరముగన్ క్రీస్తేసున్ బట్టి
" ఎంతో "
చరణం 4:
దాహము గొనగన్ జేదు చిరకన్ ద్రావ నిదిరి ద్రోహులకటా
ధాత్రిన్ ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగెనహాహా
" ఎంతో "
చరణం 5:
బల్లెముతోన్ బ్రక్కన్ బొడవన్ పారే నీరు రక్త మహాహా
ఏరై పారె యేసు రక్త మెల్ల ప్రజల కెలిమి నొసంగు
" ఎంతో "
Comments