చూడారె సిలువను - chudare siluvanu song lyrics

చూడారే సిలువను - వ్రేలాడు యేసయ్యను 
పాడు లోకంబునకై - గోడు జెందె గదా 

నా చేతులు చేసినట్టు - దోషంబులే గదా 
నా రాజు చేతులలో - ఘోరంబు జీలలు             " చూడారే "

దురితంబు దలంబులే - పరమ గురిని శిరముపై 
నెనరు లేక మెత్తెనయ్యో - ముండ్ల కిరీటమై        " చూడారే "

పరుగెత్తి పాదములు - చేసిన పాపంబులు 
పరమ రక్షకుని - పాదముల లో మేకులు           " చూడారే " 

పాపేచ్ఛ తోడ గూడు - నాడు చెడ్డ పడకలే 
పరమ గురుని ప్రక్కలోని - బళ్ళెంబు పోటులు   " చూడారే " 


Comments

Popular Posts