ashrayuda na yesayya song lyrics
ఆశ్రయుడా నా యేసయ్యా
స్తుతి మహిమ ప్రభావము నీకెనయ్యా (2)
విశ్వ విజేతవు సత్య విధాతవు
నిత్య మహిమకు ఆధారము నీవు (2)
లోక సాగరానా కృంగిన వేల
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకెనయ్యా ఆరాధనా
నీకెనయ్యా స్తుతి ఆరాధనా (2) " ఆశ్రయుడా"
తెల్లని వెన్నెల కాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు
కరుణను చూపి కలుషము బాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు (2)
జనులకు దైవం జగతికి దీపం
నీవు గాక ఎవరున్నారు
నీవే నీవే ఈ సృష్టిలో
కోనియాడబడుచున్న మహారాజువు (2) " ఆశ్రయుడా"
జీవితదినములు అధికములగునని
వాగ్దానము చేసి దీవించితివి (2)
ఆపత్కాలమున అండగా నిలిచి
ఆశల జాడలు చూపించితివి (2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలను బాపి నా స్థితి మార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యము
సాత్వికమే నీ సౌందర్యమా (2) " ఆశ్రయుడా "
నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించేదను నా స్తుతి అర్పణ (2)
పరిశుద్దులలో నీ స్వాస్థ్యము యొక్క
మహిమైశ్వర్యము నే పొందుటకు (2)
ప్రతి విషయములలో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్ధించెదను
పరిశుద్దుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా (2) " ఆశ్రయుడా "
Comments