akshayuda na priya yesayya song lyrics || Hosanna minsitries new song lyrics
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం
నీవు నా కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసిపోదామని
యుగయుగములు నన్నేలుతావని
నీకే నా ఘన స్వాగతం (2)
నీ బలపీఠమందు పక్షులకు వాసమే దొరికేనే
అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే
నేను ఏమందును ఆకాక్షింతును
నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా
చిరకాల ఆశను నెర వేర్చుతవని
మదిలో చిరు కోరిక " అక్షయుడా "
నీ అరచేతిలో నన్ను చెక్కుకొని మరువలేదంటివే
నీ కనుపాపగా నన్ను కాచుకొని దాచుకుంటావు లే
నను రక్షించిన ప్రాణమర్పించిన
నను స్నేహించిన నను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా ప్రాణార్పణముగా
నా జీవితమును అర్పించుకున్నానయా " అక్షయుడా "
నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదువ లేకుండెనే
బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపెనే
అది స్థిరమైనదై క్షేమము నొందేనే
నీ మహిమాత్మతో నెమ్మది పొందేనే
నా ప్రియుడా యేసయ్యా
రాజ్యాలనేలే శకపురుషుడా నీకు సాటెవ్వరు " అక్షయుడా "
Comments