యేసయ్య నా ఘన దైవమా - yesayya na ghana dhaivama song lyrics || thandri sannidhi minsitries 2025 new song lyrics
యేసయ్య నా ఘన దైవమా
నా అభిషేక తైలమా
ఆనంద సంగీతమా
నీకే నా స్తోత్రము - స్తోత్ర సింహాసనం
నా ప్రార్థనలను ఆలకించువాడవు
ప్రార్థనలన్నియు నెరవేర్చువాడవు
మాట తప్పని దేవుడా
మదిలో వ్యధను తొలగించిన
నీకే నా స్తోత్రము - స్తోత్ర సింహాసనం " యేసయ్య "
నా గాయములను మాపు వాడవు
నూతన బలమును దయచేయు వాడవు
మనసును గెలచిన మగధీరుడవు
మనవులన్నీ మన్నించిన
నీకే నా స్తోత్రము - స్తోత్ర సింహాసనం " యేసయ్య "
నా శత్రువులను ఎదిరించినవాడవు
ముందు నిలచిన నజరేయుడవు
ప్రేమను పంచిన త్యాగ ఘనుడవు
హృదయమందు నివసించిన
నీకే నా స్తోత్రము - స్తోత్ర సింహాసనం " యేసయ్య "
Comments