మారుతుంది నీ జీవితం - maruthundi nee jeevitham song lyrics
మారుతుంది నీ జీవితము - వేదన చెందకుమా
మరచిపోడు నిను యేసయ్యా - మాటే నమ్ము సుమా (2)
మోసే భారం - నువు చేసే త్యాగం
ఎదురీతలన్నీ ఎద కోతలన్నీ
చూసేను నా దైవం - చేయునులే సాయం (2)
ఆలస్యం అయ్యిందని ఆక్రందన చెందకు
రోజులు మారవని రోదించకు
ఆ రోధననే ఆరాధన గా
మనుగడనే మాధుర్యము గా (2)
మలచును నా దైవం - విడువకు నీ ధైర్యం (2) " మారుతుంది "
నీ కథ మారిందని నిరాశగా ఉండకు
నీ వ్యథ తీరదని చింతించకు (2)
నీ చింతలనే చిరునవ్వులు గా
యాతననే స్తుతి కీర్తనగా (2)
మార్చును నా దైవం విడువకు విశ్వాసం (2) " మారుతుంది "
Comments