కలములతో రాయగలమా - kalamulatho rayagalama song lyrics
కలములతో రాయగలమా
కవితలతో వర్ణింపగలమా
కలలతో వివరించగలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును .. ఆరాధింతును ..
ఆరాధింతును .. ఆరాదింతును ..
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)
ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)
" ఆరాధింతును "
సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నది
మహా దూతలు ప్రధానదూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2) " ఆరాధింతును "
Comments