సీయోనులో నుండి నీవు - siyonulo nundi neevu song lyrics
సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాకై (2)
సమాధానమై సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై
సియోనులో మహోన్నతుడా యేసయ్యా (2)
చరణం 1:
నిర్దోషమైన మార్గములో
నా అంతరంగమున ధైర్యము నిచ్చి (2)
నీ సన్నిధిలో నను నిలిపి
ఉన్నత విజయము నిచ్చితివి (2)
నీ ఆశలు నెరవేర్చుటకు - నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు (2) " సీయోను "
చరణం 2:
నా యందు దృష్టి నిలిపి
నీ స్నేహ బంధముతో ఆకర్షించి (2)
కృపా వరములతో నను నింపి
సత్య సాక్షిగా మార్చితివి (2)
నీ మనసుని పొందుకొని - నీ ప్రేమని నింపుకొని
కీర్తించెదను ప్రతి నిత్యం
నిను ఆరాధింతును అను నిత్యం (2) " సీయోను "
చరణం 3:
నీ దివ్యమైన మహిమను
పరలోకమందు నే చూచెదను (2)
నీ కౌగిలిలో చేర్చుకొని
ప్రతి భాష్ప బిందువును తుడిచెదవు (2)
నీ మాటల మకరందమును
మరపు రాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడూ విడువను (2) " సీయోను "
Comments