సీయోను పాటలు సంతోషముగా - siyonu patalu santhoshamuga song lyrics
సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెళ్లుదము (2)
లోకాన శాశ్వతానంద మేదియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలే నీ లోకామునందు
కొంత కాలమేన్నో శ్రమలు (2) " సీయోను "
ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్య వాసులే ఈ ధరలో (2)
నిత్య నివాసము లేదిలలోన
నేత్రాలు కనాను పై నిల్పుడి (2) " సీయోను "
మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసి యున్నానేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2) " సీయోను "
ఐగుప్తు ఆశలన్నియు విడచి
రంగుగా యేసుని వెంబడించి (2)
పాడైన కోరాహు పాపంబు మాని
విధేయులై విరాజిల్లుడి (2) " సీయోను "
ఆనందమయపరలోకంబు మనది
అక్కడ నుండి వచ్చునేసు (2)
సీయోను గీతముల్ సొంపుగా కలసి
పడేదము ప్రభు యేసుకి జై (2) " సీయోను "
Comments