సిలువ చెంత చేరిన నాడు - siluva chentha cherina nadu song lyrics
సిలువ చెంత చేరిన నాడు
కలుషములను కడిగివేయు (2)
పౌలు వలెను సీల వలెను
సిద్ధ పడిన భక్తుల జూచి (2) " సిలువ "
కొండలాంటి బండ లాంటి
మొండి హృదయంబు మండించును (2)
పండి యున్న పాపులనైన
పిలచుచుండె పరము చేర (2) " సిలువ "
వంద గొర్రెల మందలో నుండి
ఒకటి తప్పి ఒంటరి యాయే (2)
తొంబది తొమ్మిది గొర్రెల విడచి
ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్ (2) " సిలువ "
తప్పిపోయిన కుమారుఁడు
తండ్రిని విడచి తరలి పోయే (2)
తప్పు తెలిసి తిరిగి రాగా
తండ్రి యతని చేర్చుకొనెను (2) " సిలువ "
పాపి రావా పాపము విడిచి
పరిశుద్ధుల గుంపులో చేర (2)
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి అంతము (2) " సిలువ "
Comments