సర్వాధికారివి - sarvadhikaarivi song lyrics

సర్వాధికారివి సర్వఘ్నుడవు 
సంపూర్ణ సత్య స్వరూపివి నీవు (2) 
దివి లో నున్న ఆనందమును - ధరణిలో నేను అనుభవింప 
మహిమాత్మతో నను నింపితివా (2)

అతి సుందరుడా నా స్తుతి సదయుడా 
కోటి సూర్య కాంతులకన్నా నీతో సమమగునా (2) 
ఎనలేని నీ ఘన కార్యములు తలచి 
స్తుతించుచు నిను నే మహిమ పరతును (2)           " సర్వా "


బల శౌర్యము గల నా యేసయ్యా 
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా (2)
మారవే నీ సాహస కార్యములు ఎన్నడూ 
ధైర్యముగా నిను వెంబడింతును (2)                     " సర్వా " 


సర్వజగద్రక్షకుడా - లోక రాజ్య పాలకుడా 
భూ రాజులెవ్వరునైనా నీతో పోల్చగలనా (2)
బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి 
నిరీక్షణ తో నే సాగిపోదును (2)                            " సర్వా " 

Comments

Popular Posts