సర్వ కృపానిధియగు ప్రభువా - sarva krupanidhi yagu prabhuva song lyrics
సర్వ కృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసమున నిను పొగడెదను (2)
హల్లెలూయా హల్లెలూయా ..
హల్లెలూయా అని పాడెదను
ఆనందముతో సాగెదను ..
నే నానందముతో సాగెదను
చరణం 2:
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి (2)
పరిశుద్ధ జీవితము చేయుటకై
పాపిని నను కరుణించితివి (2) " సర్వ కృపా "
చరణం 3:
అల్ప కాలశ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి (2)
నాథుని అడుగు జాడలలో
నడచుటకు నను పిలిచితివి (2) " సర్వ కృపా "
చరణం 4:
మరణము శరీరము మార్పునొంది
మహిమ శరీరము పొందుటకై (2)
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి (2) " సర్వ కృపా "
చరణం 5:
భువి నుండి శ్రేష్ఠ ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యము గా (2)
భూ జనములలో ఉండినను
ప్రేమించి క్రయదనమిచ్చితివి (2) " సర్వ కృపా "
చరణం 6:
ఎవరు పాడని గీతమును
యేసుని గూర్చి పాడుటకై (2)
హేతువు లేకయే ప్రేమించెను
యేసుకి నేనేమివ్వగలను (2) " సర్వ కృపా "
Comments