సర్వచిత్తంబు నీదేనయ్యా - sarva chithambu needhenayya song lyrics

సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే
సారెపై నున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా 
సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును 
                                                             " సర్వ " 
చరణం 1: 
ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి 
పరికింపు నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా 
పరిశుద్ధుని చేసి పాలించుమా 
పాపంబు బోవ నను కడుగుమా (2)          " సర్వ " 

చరణం 2:
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా 
నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ 
నిజమైన సర్వ శక్తుoడవే 
నీ చేత బట్టి నన్ రక్షింపుమా    (2)           " సర్వ " 

చరణం 3:
ఆత్మ స్వరూపి నీ చిత్తమే అనిషంబు చెల్లు నిహపరమున 
అధికంబుగా నన్నీయాత్మతో ఆవరింపుమో రక్షకా 
అందరూ నాలో క్రీస్తుని చూడ 
ఆత్మతో నన్ను నింపుము దేవా (2)           " సర్వ " 


              

Comments

Popular Posts