నాలో నీవు నీలో నేను - naalo neevu neelo nenu song lyrics || thandri sannidhi new year song 2025 lyrics

నాలో నీవు - నీలో నేను ఉండాలని 
నీ యందే పరవశించాలని 
నా హృదయ ఆశయ్యా - ప్రియుడా యేసయ్యా 

చరణం 1 :
కడలి ఎంత ఎగసిపడినా - హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక 
కలతలన్నీ సమసి పోయే - కన్న తండ్రి నిను చేరినాక 
కమనీయమైనది నీ దివ్య రూపము 
కలనైనా మరువను నీ నామ ధ్యానము (2)     " నాలో నీవు "

చరణం 2 :
కమ్మనైనా బ్రతుకు పాట - పాడుకొందును నీలో యేసయ్యా 
కంటి పాప ఇంటి దీపం - నిండు వెలుగు నీవే కదయ్యా 
కరుణా తరంగము తాకెను హృదయము 
కనురెప్ప పాటులో మారెను జీవితం (2)        " నాలో నీవు " 

చరణం 3 :
స్నేహమైనా సందడైనా - ప్రాణమైనా నీవే యేసయ్యా 
సన్నిధైనా సౌఖ్యమైన - నాకు ఉన్నది నీవే కదయ్యా 
నీలోనే నా బలం - నీలోనే నా ఫలం 
నీలోనే నా వరం - నీవేగా నా జయం (2)      " నాలో నీవు " 

Comments

Popular Posts