ఎవరికి ఎవరు ఈ లోకం లో - evariki evaru ee lokam lo song lyrics latest song lyrics
ఎవరికి ఎవరు ఈ లోకం లో
ఎంత వరకు మనకీ బంధము (2)
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికి ఎవరు శాశ్వతము (2)
మన జీవితం ఒక యాత్ర
మన గమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్ని గెలవడమే మన తపన (2)
తల్లి దండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే (2)
స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ (2)
నీ ధనమున్నంత వరకే (2) " మన జీవితం "
ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే
ఈ శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే (2)
యేసులో విశ్వాసం యేసుకై నిరీక్షణ (2)
కాదెన్నడు నీకు వ్యర్థం (2) " మన జీవితం "
Comments