సద్గుణ శీలుడా - sadguna sheeluda song lyrics

సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు 
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు 
సత్య ప్రమానముతో శాశ్వత కృపనిచ్చి 
నీ ప్రియుని స్వాస్థ్యమును నాకిచ్చితివి      (2) 

యేసయ్యా నీ సంకల్పమే 
ఇది నాపై నీకున్న అనురాగమే (2) 

సిలువ సునాదమును నా శ్రమ దినమున 
మధుర గీతికగా మదిలో వినిపించి  (2) 
సిలువలో దాగిన సంపదలిచ్చి 
కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో  (2) 
                                                   " యేసయ్యా " 

నా తోడు నీడవై మరపురాని 
మహోపకార్యములు నాకై చేసి (2)
చీకటి దాచిన - వేకువగా మార్చి 
బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే (2) 
                                                  " యేసయ్యా " 

నా మంచి కాపరివై మమతా సమతలు 
మనోహర స్థలములలో నాకనుగ్రహించి (2)
మారా దాచిన మధురము నాకిచ్చి 
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆధ్యంతమై (2)
                                                 " యేసయ్యా " 

Comments

Popular Posts