నా యేసయ్య - naa yesayya calvary temple new song lyrics
నా యేసయ్యా ..
నీ కృపను మరువలేనయ్యా
నా యేసయ్యా ..
నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా (2)
నీ నామ స్మరణ లో దాగిన జయము
నీ వాక్య ధ్యానము లో పొందిన బలము (2)
తలచుకొనుచు .. నా యాత్రను ..
నే కొనసాగించెద (2)
ఆ ఆహా .. హల్లెలూయా
ఓ ఓహో .. హోసన్నా (2) " నా యేసయ్యా "
చరణం 1:
నా గుమ్మముల గడియలు బలపరచితివి
నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి (2)
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి " ఆ ఆహా "
చరణం 2:
నీ రెక్కల నీడలో నను దాచితివి
నీ వాగ్ధానాలెన్నో నెరవేర్చితివి (2)
నా భయ భీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవింప గొప్ప భాగ్యము నిచ్చితివి " ఆ ఆహా "
Comments