సమీపించరాని తేజస్సులో నీవు - sameepincha raani thejassulo neevu song lyrics
సమీపించరాని తేజస్సులో నీవు
వసియించువాడవయ్యా
మా సమీపమునకు దిగివచ్చినావు
నీ ప్రేమ వర్ణింపతరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) " సమీపించ "
ధరయందు నేనుండ - చెరయందు పడియుండ
కరమందు దాచితివే - నన్నే పరమందు చేర్చితివి (2)
ఖలునకు కరుణను నొసగితివి (2) " సమీపించ "
మితిలేని నీ ప్రేమ - గతిలేని నను చూసి
నా స్థితి మార్చినది - నన్నే శృతిగా చేసినది (2)
తులవకు విలువను ఇచ్చినది (2) " సమీపించ "
Comments