వివాహమన్నది పవిత్రమైనది - vivahamannadhi pavithramainadhi song lyrics

వివాహమన్నది పవిత్రమైనది 
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

ఎముకలలో ఒక ఎముకగా 
దేహములో సగ భాగముగా (2) 
నారిగా సహకారిగా 
స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)        " వివాహమన్నది " 

ఒంటరిగా ఉండరాదని 
జంటగా ఉండ మేలని (2)
శిరస్సు గా నిలవాలని 
పురుషుని నియమించినాడు దేవుడు (2)
                                                  " వివాహమన్నది "

దేవునికి అతి ప్రియులుగా 
ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని 
ఒకటిగా ఇల చేసినాడు దేవుడు (2) 
                                                  "వివాహమన్నది "

Comments

Popular Posts