విజయగీతము మనసార - vijayageethamu manasara song lyrics

విజయగీతము మనసార నేను పాడెద 
నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు (2)
పునరుద్ధానుడ నీవే నా ఆలాపన 
నీకే నా ఆరాధన (2) 


ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే 
పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది 
నీ ఉత్తమమైన సంఘములో (2)              " విజయ " 

ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి 
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము 
నీ పరిశుద్ధులలో నిలిపినది (2)                " విజయ "

నూతన యెరూషలేం సీయోనునాకై 
నిర్మించియున్నావు నీవు - ఈ నిరీక్షణయే 
రగులుచున్నది నాలో (2)
యేసయ్యా నీ ఆధిపత్యమ అర్హత కలిగించె
నీ ప్రసన్న వధనమును ఆరాధించ (2)     " విజయ " 

Comments

Popular Posts