వర్ధిల్లెదము మన దేవుని - vardhilledhamu mana devuni song lyrics

వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు 
నాటబడినవారమై 
నీతిమంతులమై మొవ్వు చేయుదము 
యేసు రక్తములోనే జయము మనకు జయమే 
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే (2)

యెహోవా మందిర ఆవరణములో 
ఎన్నెన్నో మేళ్లు గలవు - 
ఆయన సన్నిధిలోనే నిలిచి 
అనుభవింతుము ప్రతి మేలును  (2)       " వర్ధిల్లెదము " 

యేసయ్య సిలువ బలియాగములో 
అత్యున్నత ప్రేమ గలదు - 
ఆయన సముఖము లోనే నిలిచి 
పొందెదము శాశ్వత కృపను (2)             " వర్ధిల్లెదము "

పరిశుద్ధాత్ముని అభిషేకము లో 
ఎంతో ఆదరణ కలదు - 
ఆయన మహిమైశ్వర్యము మన 
దుఃఖము సంతోషముగా మార్చును (2)  " వర్ధిల్లెదము " 

Comments

Popular Posts