స్తుతి పాడుటకే బ్రతికించిన - sthuthi padutake brathikinchina song lyrics

స్తుతి పాడుటకే బ్రతికించిన - జీవ ప్రధాతవు నీవేనయ్యా 
ఇన్నాళ్లుగా నను పోషించిన - తల్లి వలే నను ఓదార్చిన 
నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా (2) 
జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా 
నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును (2) 

ప్రాణ భయమును తొలగించినావు -
ప్రాకారములను స్థాపించినావు 
సర్వజనులలో నీ మహిమ వివరింప -
దీర్ఘాయువుతో నను నింపినావు (2) 
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై -
తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను (2)
                                                                     " స్తుతి "

నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు - 
కనుమరుగాయెను నా దుఃఖ దినములు 
కృపాలను పొంది నీ కాడి మోయుటకు - 
లోకములోనుండి ఏర్పరచినావు (2)
నీ దివ్య సంకల్పమే అవని లో శుభప్రధమై - 
నీ నిత్య రాజ్యముకై నిరీక్షణ కలిగించెను       (2) " స్తుతి "

హేతువు లేకయే ప్రేమించినావు 
వేడుకగా  ఇల నను మార్చినావు
కలవర మొందిన వేళల యందు 
నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై 
నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులా (2) " స్తుతి " 


Comments

Popular Posts