స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము - sthothram chellinthumu sthuthi sthothram chellinthumu song lyrics

స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము 
యేసు నాథుని మేలులు తలచి (2) 

దీవారాత్రములు కంటి పాపవలే కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) 

గాఢాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనియక కృపాలతో బలపరచితివి (2)

సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మ ను నొసగితివి(2)

సీయోను మార్గములో పలు శోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) 

సిలువను మోసుకొని సువార్త ను చేపట్టి (2) 
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) 

పాడెద హల్లెలూయా మరనాథ హల్లెలూయా (2)
సదా పాడెద హల్లెలూయ ప్రభు యేసుకే హల్లెలూయ (2) 




Comments

Popular Posts