శృతి చేసి నే పాడనా - sruthi chesi ne padana song lyrics

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం 
భజియించి నే పొగడనా స్వామి (2)
శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం 
హల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా (2)  " శృతి "

దానియేలును సింహపు బోనులో 
కాపాడినది నీవే కదా (2)
జల ప్రళయములో నోవాహు ను గాచిన 
బలవంతుడవు నీవే కదా (2)
నీవే కదా (౩)                                   " హల్లెలూయా " 

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్యహితుడవు నీవే కదా (2)
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన 
కరుణామయుడవు నీవే కదా (2)   
నీవే కదా (3)                                 " హల్లెలూయా " 


Comments

Popular Posts