సన్నుతించెదను దయాలుడవు నీవని - sannuthinchedhanu dhayaludavu neevani song lyrics

సన్నుతించెదను దయాలుడవు నీవని 
యెహోవా నీవే దయాలుడవని 
నిను సన్నుతించెదను (2)
సన్నుతించెదను దయాలుడవు నీవని 

సర్వసత్యములో నను నీవు నడిపి 
ఆదరించిన పరిశుద్ధాత్ముడా (2)
కృపాధారము నీవేగా షాలేము రాజా 
నిను సన్మానించెదను (2)               " సన్నుతించెదను "


నీ కనుచూపుల పరిధిలో నన్ను నిలిపి 
చూపితివా నీ వాత్సల్యమును (2)
కృపానిధివి నీవే గా నా యేసు రాజా 
నిన్ను సన్మానించెదను (2)            " సన్నుతించెదను " 

Comments

Popular Posts