సజీవుడవైన యేసయ్యా - sajeevudavaina yesayya song lyrics

సజీవుడవైన యేసయ్యా 
నిన్నాశ్రయించిన నీ వారికి 
సహాయుడవై తృప్తి పరచితివే 
సముద్రమంత సమృద్ధి తో  (2)
ఆనందించెద నీలో - అనుదినము కృప పొంది 
ఆరాధించెద నిన్నే  - ఆనంద ధ్వనులతో (2) 

ధనరాసులే ఇల 
ధనవంతులకు - ఈలోక భాగ్యము 
దాచిన మేలులెన్నో - దయచేసినావే 
ఇహ పరమున నాకు (2)
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే 
శ్రేష్ఠమైన నీ సత్య వాక్యముతో (2)       " సజీవుడవైన "

క్షేమము నొందుటయే 
సర్వజనులకు - ప్రయాస గా మారే 
క్షేమాధారము నీవై - దీర్ఘాయువుతో 
సంతృప్తి పరుతువు నన్ను (2) 
నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే 
నిత్యమైన నీ సత్య వాక్యముతో (2)   " సజీవుడవైన " 

నలువది యేండ్లు 
నీ స్వాస్థ్యమును - మోసినది నీవే 
నీ కృపా కాంతి లో నా చేయి విడువక 
నడిపించుచున్నది నీవే (2) 
పరమ రాజ్యములో మహిమతో నింపుటకు 
అనుగ్రహించితివే - పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2)
                                                     " సజీవుడైన " 

Comments

Popular Posts