రాజా జగమెరిగిన - raja jagamerigina song lyrics
రాజా జగమెరిగిన నా యేసు రాజా
రాగాలలో అను రాగాలు కురిపించిన
మన బంధము అనుబంధము (2)
విడదీయగలరా ఎవరైననూ ఏదైననూ (2) " రాజా "
దీన స్థితియందున సంపన్న స్థితియందున
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగియిందును (2)
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా (2) " రాజా "
బలహీనతలయందున అవమానములయందున
పడినను కృంగినను నీ కృపకలిగియుందునే (2)
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా (2) " రాజా "
సీయోను షాలేము మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే (2)
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా (2). " రాజా "
Comments