లెమ్ము తేజరిల్లుము అని - lemmu thejarillumu ani song lyrics

లెమ్ము తేజరిల్లుము అని 
నను ఉత్తేజపరచిన నా యేసయ్యా (2) 
నిన్నే స్మరించుకొనుచూ నీ సాక్షిగా ప్రకాశించుచు 
రాజాధి రాజువని ప్రభువుల ప్రభువని 
నిను వేనోళ్ళ ప్రకటింతును (2) 

ఉన్నత పిలుపును నిర్లక్షపరచక 
నీతో నడచుటే నా భాగ్యము (2)
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి 
నీ కృప చూపితివి (2) 
ఇదియే భాగ్యము .. ఇదియే భాగ్యము .. 
ఇదియే నా భాగ్యము (2)                          " లెమ్ము " 

శ్రమలలో నేను ఇంతవరకును 
నీతో నిలుచుటే నా ధన్యత (2)
జీవ కిరీటము నీ పొందుటకే 
నను చేరదీసితివి (2) 
ఇదియే ధన్యత .. ఇదియే ధన్యత .. 
ఇదియే నా ధన్యత ..                               " లెమ్ము " 

తేజోవాసుల స్వాస్థ్యము నేను 
అనుభవించుటే నా దర్శనము (2) 
తేజోమయమైన షాలేము నగరు లో 
నిను చూసి తరింతునే (2) 
ఇదియే దర్శనము .. ఇదియే దర్శనము .. 
ఇదియే నా దర్శనము ..                         " లెమ్ము " 

Comments

Popular Posts