యెహోవా నీ నామము - yehova ne namamu song lyrics

యెహోవా నీ నామము - ఎంతో బలమైనది 
ఎంతో బలమైనది (2) యెహోవా నీ నామము ..

మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2)
యెహోషువ ప్రార్ధించగా - సూర్యాచంద్రులనాపితివి (2) 

నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) 

సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్లిరి (2)
ప్రార్ధించిన వెంటనే రక్షించే నీ హస్తము (2)

చెరసాలలో వేసిన సంకెళ్లు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్లు విడిపోయెను (2)

పౌలు సీలను బంధించి చెరసాలలో వేసిన (2) 
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్ధలాయే (2) 


Comments

Popular Posts