యెహోవా నా బలమా - yehova naa balama song lyrics

యెహోవా నా బలమా 
యదార్థమైనది నీ నామం - పరిపూర్ణమైనది నీ నామం 
యెహోవా (2) 

నా శత్రువులు నను ముట్టినను - నరకపు శాపములరికట్టినను (2)
వరద వలే భక్తి హీనులు పొర్లిన 
విడువక నను ఎడబాయని దేవా (2)      " యెహోవా " 

మరణపుటురులలో మరువక మొరలిడ 
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై (2) 
తన ఆలయములో నా మొర వినెను - అధరెను 
ధరణి భయకంపముచే (2)                  " యెహోవా "  

నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని 
వెలుగుగా జేయును (2) 
జలరాసుల నుండి బలమైన చేతితో - 
వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2)  " యెహోవా " 

మేఘములపై ఆయన వచ్చును - మేఘములను 
తన మాటుగా జేయును (2) 
ఉరుములు మెరుపులు మెండుగా జేసీ - 
అపజయమిచ్చును అపవాదికిని (2)   " యెహోవా " 

నా కాళ్ళను లేడి కాళ్ళగా జేసీ - ఎత్తైన స్థలములో 
ఎత్తైన స్థలములో శక్తితో నింపి (2)
రక్షణ కేడెము నాకందించి - అక్షయముగా తన 
పక్షము జేర్చిన  (2) 

పౌరుషము గల ప్రభు కోపింపగా - పర్వతముల
పునాదులు వణకెను (2)
తన నోట నుండి వచ్చిన యగ్ని - దయించి వేసెను
వైరుల నెల్ల  (2)                                 " యెహోవా "

యెహోవా జీవము గల దేవా - బహుగా స్థుతులకు
అర్హుడ నీవే (2) 
అన్య జనులలో ధన్యత చూపుచు - హల్లెలుయా స్తుతి గానము చేసేదా (2)                          " యెహోవా " 





Comments

Popular Posts