రాకడ సమయం లో - rakada samayamulo song lyrics

రాకడ సమయం లో కడబూర శబ్ధముతో 
యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా (2)
 
రావయ్య యేసయ్యా వేగమే రావయ్యా 
రావయ్య యేసు నాథా వేగమే రామయ్యా (2)
                                               " రాకడ "

యేసయ్య రాకడ సమయములో 
ఎదురేగే రక్షణ నీకుందా (2) 
లోకాశాలపై విజయం నీకుందా (2)              " రావయ్య " 

ఇంపైన ధూప వేదికగా 
ఏకాంత ప్రార్ధన నీకుందా (2) 
యేసు ఆశించే దీన మనసుందా (2)            " రావయ్య " 

దినమంతా దేవుని సన్నిధిలో 
వాక్యము కొరకు ఆకలి నీకుందా (2) 
యేసు నాధునితో సహవాసం నీకుందా (2)  " రావయ్య "

శ్రమలోన సహనం నీకుందా 
స్తుతియించే నాలుక నీకుందా (2) 
ఆత్మల కొఱకైన భారము నీకుందా (2)       " రావయ్య "

నీ పాత రోత జీవితము 
నీ పాప హృదయం మారిందా (2) 
నూతన హృదయం తో ఆరాధన నీకుందా (2) " రావ "

అన్నీటి కన్నా మిన్నగా 
కన్నీటి ప్రార్ధన నీకుందా (2) 
ఎల్ల వేళలలో స్తుతియాగం నీకుందా (2)   " రావయ్య " 

                               

Comments

Popular Posts