మేలు చేయక నీవు ఉండలేవయ్య - melu cheyaka neevu undalevayya song lyrics

మేలు చేయక నీవు ఉండలేవయ్యా 
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) 
యేసయ్యా .. యేసయ్యా 
యేసయ్యా .. యేసయ్యా (2) 


చరణం 1 : 
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవ్వరిని నమ్మలేదయ్యా 
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక (2)
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2) 
క్రియలున్న ప్రేమ నీది - నిజమైన ధన్యత నాది 
                                                     " యేసయ్యా " 

చరణం 2 : 
ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను 
పశ్చాత్తాపం కలిగే నాలో - 
నేను పాపినని గ్రహియించగానే (2) 
నీ మేళ్లకు అలవాటయ్యి - 
నీ పాదములు వదలకుంటుని (2) 
నీకిష్టమైన దారి - కనుగొంటిని నీతో చేరి (2) 
                                                   " యేసయ్యా "

చరణం 3 : 
పాపములు చేసాను నేను - నీ ముందర తల ఎత్తలేను 
క్షమియించ గలిగే నీ మనసు - 
ఓదార్చింది నా ఆరాధన లో (2)
నా ఆనందం నీతో అంది - నీకు వేరై మనలేనని (2) 
                                                  " యేసయ్యా " 

Comments

Popular Posts