మారని దేవుడవు నీవేనయ్యా - marani devudavu neevenayya song lyrics

మారని దేవుడవు నీవేనయ్యా
మరుగైయుండలేదు నీకు యేసయ్యా (2) 
సుడులైన సుడిగుండాలైన 
వ్యధలైన వ్యాధి బాధలైన (2)
మారుగై యుండలేదు నీకు యేసయ్యా (2) 


చిగురాకుల కొసల నుండి జారి పడే మంచులా 
నిలకడ లేని నా బ్రతుకును మార్చితివే (2) 
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2) 
మారని దేవుడవయ్యా మరువని యేసయ్యా (2)
                                              " మారని " 

నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా 
నిత్య జీవ గమ్యానికి నను చేర్చితివి (2) 
నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచు (2) 
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) 
                                             " మారని "

Comments

Popular Posts