మహా దేవుడా మహోన్నతుడా - maha devuda maha parishuddhuda song lyrics
మహా దేవుడా మహోన్నతుడా
మహా ఘనుడా మా పరిశుద్ధుడా
యుగయుగములకు దేవుడవు
తరతరములకు నీవే మా ప్రభుడవు
స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా
స్తుతులందుకో నా యేసయ్యా
ఆరాధన నీకే యేసయ్యా
స్తుతి అర్పణ నీకే మెస్సయ్యా
యెహోవా ఈరే యెహోవా షమ్మా
యెహోవా షాలోమ్ యెహోవా రాఫా
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాద పీఠం
అడవి మృగములు ఆకాశపక్షులు
సముద్ర మత్స్యములు నీ నిర్మాణములు
మంటితో నరుని నిర్మించినావు
నీ పొలికతో సృజియించినావు
నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు
నీ వారసునిగా మము పిలిచినావు " యెహోవా "
పరిశుద్ధుడు పరిశుద్ధుడని
సెరాపులు నిన్ను స్తుతియించగా
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమా ఘనత
పరలోకమే నీ మహిమతో నిండెను
భూ జనులకు సమాధానం కలిగెను
సైన్యములకు అధిపతి నీవు
సర్వ సృష్టికి పూజ్యుడ నీవు " యెహోవా "
Comments