ప్రియ యేసు రాజు - priya yesu raju song lyrics

ప్రియ యేసు రాజును నే చూచినా చాలు 
మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) 
నిత్యమైన మోక్ష గృహము నందు చేరి 
భక్తుల గుంపు లో హర్షించిన చాలు (2) 

యేసుని రక్తమందు కడుగబడి 
వాక్యం చే నిత్యం భద్రపరచబడి (2)  
నిస్ఖలంక పరిశుద్ధుల తో పేదన్ నేను (2) 
బంగారు వీధులలో తిరిగెదను (2)                " ప్రియ " 

ముండ్ల మకుటంబైన తలను చూసి 
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) 
కొరడాతో కొట్టబడిన వీపున్ చూచి (2) 
ప్రతి యొక్క గాయంబును చుంబింతును (2) " ప్రియ "

హృదయము స్తుతులతో నింపబడెను 
నా బాగ్య గృహమును స్మరించుచు (2) 
హల్లెలూయా  ఆమెన్ హల్లెలూయా (2)
వర్ణింప నా నాలుక చాలదయ్యా (2)              " ప్రియ " 

ఆహా ఆ బూర ఎపుడు ధ్వనించునో 
ఆహా నా ఆశ ఎపుడు తీరుతుందో (2) 
తండ్రి నా కన్నీటిని తుడచునెపుడో (2)
ఆశతో వేచియుండే నా హృదయము (2)      " ప్రియ " 


Comments

Popular Posts