ప్రియ యేసు నిర్మించితివి - priya yesu nirminchithivi song lyrics

ప్రియ యేసు నిర్మించితివి 
ప్రియమార నా హృదయం 
ముదమార వసియించునా 
హృదయాంతరంగమునా 

నీ రక్త ప్రభావమున 
నా రోత హృదయంబును (2) 
పవిత్ర పరచుము తండ్రి 
ప్రతి పాపమును కడిగి (2)                      " ప్రియ "


అజాకరూకుడనైతి 
నిజయాశ్రమును విడిచి (2) 
కరుణా రసముతో నాకై 
కనిపెట్టితివి తండ్రి (2)                          " ప్రియ " 

వికసించే విశ్వాసంబు 
వాక్యంబును చదువగనే (2) 
చేరితి నీదు దారి 
కోరి నడిపించుము (2)                        " ప్రియ " 

ప్రతి చోట నీ సాక్షిగా 
ప్రభువా నేనుండునట్లు (2) 
ఆత్మాభిషేకము నిమ్ము 
ఆత్మీయరూపుండా (2)                       " ప్రియ " 






Comments

Popular Posts