ప్రేమ యేసుని ప్రేమ - prema yesuni prema song lyrics

ప్రేమ యేసుని ప్రేమ అది  ఎవరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది (2) 

ఎన్నడెన్నడు మారనిది
నా యేసుని దివ్య ప్రేమ 
ఎన్నడెన్నడు వీడనిది 
నా యేసుని నిత్య ప్రేమ (2) 

తల్లి తండ్రులు ప్రేమ 
నీడ వలే గతియించును (2)
భార్య బిడ్డల ప్రేమ 
అది కలలా కరిగిపోవును (2)
                                                        " ఎన్న " 

భార్య భర్తల మధ్య 
వికసించిన ప్రేమ పుష్పము (2)
వాడి పోయి రాలును త్వరలో 
అది మోడుగా మిగిలిపోవును (2)   
                                                        " ఎన్న " 

బంధు మిత్రుల యందు 
వెలుగుచున్న ప్రేమ దీపము (2) 
నూనె ఉన్నంత కాలమే 
వెలుగునిచ్చి  ఆరిపోవును (2) 
                                                        " ఎన్న " 

ధరణి లోని ప్రేమలన్నియు
స్థిరము కావు తరిగిపోవును  (2) 
క్రీస్తు యేసు కలువరి 
ప్రేమ కడవరకు ఆదరించును (2)          " ఎన్న " 
               



Comments

Popular Posts