పరిశుద్ధుడవై - parishuddhudavai song lyrics
పరిశుద్ధుడవై - మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపువాడవు (2)
దయాలుడవై ధారాలముగా
నను దీవించిన శ్రీ మంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2)
" పరిశుద్ధుడవై "
నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి (2)
శాశ్వత కాలము వరకు నీ సంతతి పై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి (2)
" పరిశుద్ధుడవై "
నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిర పరచుటకు
నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
(2)
నాకు ప్రయోజనము కలుగ జేయుటకు
నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోష పరచితివి (2)
" పరిశుద్ధుడవై"
ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు
నీ మహిమాత్మ తో నింపి సురక్షితముగా నన్ను నివసింప చేసితివి (2)
మేఘ వాహనుడవై వచ్చు వరకు నే
కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసుల కాంక్షను సంతోష పరచెదవు (2)
" పరిశుద్ధుడవై "
Comments