నీవు నాతోడు ఉన్నావయ్యా - neevu na thodu unnavayya song lyrics

నీవు నా తోడు ఉన్నావయ్యా 
నాకు భయమేల నా యేసయ్యా 
నీవు నాలోనే ఉన్నావయ్యా 
నాకు దిగులేల నా మెస్సయ్యా 
నాకు భయమేల నాకు దిగులేల 
నాకు చింతేల నాకు భీతి ఏల (2)           " నీవు " 

కష్టములలో నష్టములలో నా తోడు ఉన్నావు 
వేదన లో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చే వాడవు 
వెదకిన వారికి దొరికే వాడవు (2) 
తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు (2) 
దేవా దేవా నీకే స్తోత్రం (4)                    " నీవు "

వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు 
రక్షణ లో సంరక్షకుడవై ఫ్ ధైర్యము పంచావు (2) 
నేనే సత్యం అన్న దేవా 
నేనే మార్గం అన్న దేవా (2) 
నేనే జీవం అని పలికిన దేవా (2) 
దేవా దేవా నీకే స్తోత్రం (4)                  " నీవు " 

Comments

Popular Posts