మేలులు నీ మేలులు- melulu ne melulu song lyrics

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
నా ప్రాణమున్నంత వరకు 
విడిచిపోలేనయ్యా             " మేలులు " 

కొండలలో ఉన్ననూ   (నీవు) 
మరచిపోలేదయ్యా 
శ్రమలలో ఉన్ననూ   (నీవు)
విడిచి పోలేదయ్యా
నీది గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా 
గొర్రె పిల్ల మనసయ్యా (3)                     " మేలులు " 

అగ్నిలో ఉన్ననూ  (నేను)
కాలిపోలేదయ్యా 
జలములలో వెళ్లినా (నేను) 
మునిగి పోలేదయ్యా (2)
నీది పావురము మనసయ్యా యేసయ్యా 
పావురము మనసయ్యా (3)                " మేలులు " 

 చీకటిలో ఉన్ననూ (నన్ను) 
మరచి పోలేదయ్యా 
ధుఃఖములో ఉన్ననూ (మంచి) 
స్నేహితుడవయ్యావయ్యా (2)
నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా 
ప్రేమించే మనసయ్యా (3)                 " మేలులు " 

Comments

Popular Posts